భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా లింగార్చన

భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా లింగార్చన

SRCL: వేములవాడ రాజరాజేశ్వరక్షేత్రంలోని అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి మహా లింగార్చన ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ వేద పండితుల వేద పండితుల నేతృత్వంలో అర్చకులు స్వామివారి మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పిండితో రూపొందించిన ప్రమిదలను లింగాకారంలో అమర్చి దీపాలు వెలిగించారు.