VIDEO: తాటిచెట్లు తొలగింపుపై అధికారులకు ఫిర్యాదు

HNK: ఐనవోలు మండలం కేంద్రంలో తమకు జీవనాధారంగా ఉన్న తాటి చెట్లను తొలగించారని గౌడ సంఘం నేతలు గురువారం అబ్కారిశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓ వ్యక్తి తన భూమిలో తాటి చెట్టు ఉండడంతో ఎలాంటి సమాచారం లేకుండా జేసీబీ సహాయంతో 50 తాటి చెట్లకు పైగా కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గీత కార్మికులకు ఆధారంగా ఉన్న చెట్లను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.