ధర్మస్థలపై తీర్పు రిజర్వు

ధర్మస్థలపై తీర్పు రిజర్వు

ధర్మస్థలలో వందలాది మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నప్ప బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతడికి బెయిల్ ఇవ్వొద్దని సిట్ తరఫు న్యాయవాది జడ్జిని కోరారు. వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు బంగళా గుట్ట వెనకాల శవాలు దొరికినా సిట్ రహస్యంగా ఉంచిందని విద్యార్థిని సౌజన్య బంధువులు ఆరోపిస్తున్నారు.