నర్సరీని పరిశీలించిన కలెక్టర్
SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని మూడవ వార్డులో నర్సరీని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ శనివారం పరిశీలించారు. ఏ మొక్కలు ఉన్నాయి ఎలా పెరుగుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలకు ఎప్పటికప్పుడు నీరు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, అధికారులు పాల్గొన్నారు.