'ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి'
VKB: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గౌతమ్ సూచించారు. గురువారం ఆయన వికారాబాద్‌లోని ఎన్నెపల్లి 3వ వార్డులో ఇళ్లను జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు.