జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

BHPL: భూపాలపల్లిలో ఈ నెల 26న నిర్వహించబోయే జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీయువకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తాగునీరు, భోజన సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు.