మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

MBNR: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు