VIDEO: గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన
GDWL: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన మరవక ముందే అదే మండలంలో ఉన్న ఎస్సీ గురుకులంలో శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. ఉదయం అల్పాహారం తీసుకున్న ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, కడుపునొప్పి రావడంతో గురుకుల సిబ్బంది వెంటనే వారిని గద్వాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.