నేరస్తుడిని పట్టుకున్న జవాన్‌కు సజ్జనార్ అభినందనలు

నేరస్తుడిని పట్టుకున్న జవాన్‌కు సజ్జనార్ అభినందనలు

HYD: అంబర్‌పేటలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన పాత నేరస్తుడిని రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడు ధైర్యంగా పట్టుకున్నారు. ఆయన సాహసాన్ని సీపీ వీసీ సజ్జనార్ అభినందించి నగదు రివార్డు అందజేశారు. నిందితుడు అబ్దుల్ మన్నన్‌గా గుర్తించారు. ఘటన సమయంలో రాముడు తక్షణమే డయల్ 100కు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.