రామప్పను సందర్శించిన అమెరికన్లు
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సోమవారం అమెరికా దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్‌ను ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. రామప్ప శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టూరిస్ట్ పోలీసులు పాల్గొన్నారు.