కాంగ్రెస్ పార్టీలో చెరికలు
NGKL: వెల్దండ మండలం బర్కత్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ మలికేడి నవ్య ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సర్పంచ్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి తన వార్డు సభ్యులతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.