మిరప, వరి పంటల తెగుళ్ల నివారణపై అవగాహన
GNTR: ఫిరంగిపురం ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా లాం శాస్త్రవేత్త ఏ. మనోజ్, మండల వ్యవసాయ అధికారి జే. వాసంతి పాల్గొని పంటలలో వచ్చే తెగుళ్లు, పురుగుల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు.