జిల్లాలో ఎటుచూసినా శివనామస్మరణ
ATP: కార్తిక పౌర్ణమి సందర్భంగా జిల్లాలో శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పామిడిలో శ్రీ భోగేశ్వరస్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.