VIDEO: జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
NZB: జిల్లా ఇందల్వాయి మండలంలో కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి గోపి హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గోపి తన కారులో స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఇందల్వాయి సమీపంలో ఓ కారు వచ్చి గోపి కారును ఢీ కొట్టింది. అనంతరం అతన్ని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. గోపి గతంలో ఎంపీపీగా, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాడు.