గురుకుల పాఠశాలలో ఆహార కల్తీపై విజిలెన్స్ కమిటీ పరిశీలన

NLR: తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆహార కల్తీ ఘటనపై జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు బుధవారం పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన వసతులతోపాటు మంచి ఆహారాన్ని అందించాలని కమిటీ సభ్యులు మురళీకృష్ణయాదవ్ సూచించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.