శ్రీవారికి బంగారుహారం బహుకరణ

W.G: కాళ్లకూరు గ్రామంలో ఉన్న వేంకటేశ్వరస్వామికి బంగారు హారాన్ని భక్తులు మంగళవారం సమర్పించారు. భీమవరానికి చెందిన కఠారి శ్రీనివాసరాజు, సూర్యకుమారి దంపతులు 71 గ్రాములతో రెండు పేటల లక్ష్మీదేవి లాకెట్ (బంగారు హారం) దేవస్థానం ఈవో అరుణ్ కుమార్ సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా దాతలను అభినందించి వారిని స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు.