'గోదావరిలో జోరుగా నిమజ్జనాలు'

W.G: నరసాపురంలో సోమవారం గణేశ్ నిమజ్జన ఊరేగింపులు ఘనంగా నిర్వహించారు. తీన్మార్ డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్స్ ఊరేగింపు సాగింది. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రసాదాలు పంపిణీ చేశారు. వలంధర్ రేవు గోదావరిలో చిన్న సైజు వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనోత్సవాల్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఐ బి.యాదగిరి, సిబ్బంది చర్యలు చేపట్టినట్లు తెలిపారు.