'దొంగలకు చెక్ పెట్టేందుకు 400 సీసీ కెమెరాలు'
SRPT: జిల్లాలో చోరీల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు త్వరలోనే సుమారు 400 అధునాతన సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. దొంగతనం చేసినా నిందితులు తప్పించుకోవడం అసాధ్యమని, నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తుందని అన్నారు.