యువతకు సంఘటిత శక్తి అవసరం

JN: యువతకు సంఘటిత శక్తి అవసరం అని జనగామ జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు మామిడాల రమేష్ అన్నారు. లింగాల ఘనపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను శనివారం సందర్శించి వారు మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు పట్టించుకొని పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.