'ఆగర్తిపాలెంలో సబ్సిడీపై పశువులు దాణా పంపిణీ'
W.G: పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ 30 మంది పాడి రైతులకు 50% సబ్సిడీపై పశువులు దాణాను పంపిణీ చేశారు. మండల పశువైద్యాధికారి ఎస్. సుమ మాట్లాడుతూ.. 50 కేజీల బరువున్న ఒక్కో బస్తా మార్కెట్ విలువ రూ. 1110 కాగా, ప్రభుత్వ సబ్సిడీ రూ. 555 పోను, రైతు కేవలం రూ. 555 చెల్లించాలని తెలిపారు.