'ప్రభుత్వ అనుమతి లేకుండా 995 ఆస్పత్రులు నిర్వహణ'

మేడ్చల్: జిల్లాలోని ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ ఆసుపత్రిలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ ఉమాగౌరీ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 3,835 ఆసుపత్రిలో ఉండగా అందులో 2,840 అనుమతి పొందిన ఆసుపత్రులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 995 అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని వీటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.