నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

కోనసీమ: ఆత్రేయపురంలోని సత్యసాయి కేంద్రం వద్ద ఆదివారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవాకేంద్రం నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే ఈ శిబిరంలో కంటి వ్యాధులకు పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.