ఎండల దెబ్బకు బీర్ల విక్రయాలు జోరు
TG: ఎండలు మొదలవ్వడంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో దాదాపు రూ. 3,210 కోట్ల మద్యం అమ్ముడైంది. అయితే, ఫిబ్రవరి 28 ఒక్కరోజే 3.28 లక్షల కేసుల బీర్లు అమ్ముడవడం గమనార్హం. ఎండల తీవ్రత దృష్ట్యా, మార్చి నుంచి జూన్ వరకు ఈ అమ్మకాలు మరో 40 శాతం పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.