సమ్మె పరిష్కార దిశగా చర్చలు

సినిమా కార్మికుల సమ్మెకు సంబంధించి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు జరిపిన చర్చలు ముగిశాయి. సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా, మధ్యాహ్నం 2 గంటలకు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు లేబర్ కమిషనర్‌ను కలవనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫెడరేషన్ నేతల మధ్య జరగనున్న సమావేశంతో.. సమ్మె సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.