మండల కేంద్రాలకు చేరుకుంటున్న బుక్స్

మండల కేంద్రాలకు చేరుకుంటున్న బుక్స్

NLG: సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరుకుంటున్నాయి. జిల్లాకు 5,89,970 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటికే 3,67,940 పాఠ్య పుస్తకాలు జిల్లా బుక్ డిపోకు చేరాయి. మండలాల వారీగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి ప్రారంభించారు.