VIDEO: 58 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

కోనసీమ: రావులపాలెంలోని క్యాంప్ కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గానికి చెందిన 58 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరు అయిన రూ.43,23,943 చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూతని అందిస్తుందని అన్నారు.