'ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలి'
MNCL: ఈనెల 11న జరగనున్న మొదటి విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కలెక్టర్‌ల సమావేశంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. పోలింగ్ రోజు తీసుకోవలసిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక, ప్రవర్తన నియమావళి అమలపై సూచనలు చేశారు.