కొమరోలు మండల అరటి రైతుల కష్టాలివే.!

ప్రకాశం: కొమరోలు మండల అరటి రైతుల కష్టాలు ఇవి. సిరులు పండించాల్సిన అరటి పంట నష్టాల బాట పట్టిందని, నిన్న మొన్నటి వరకు టన్ను రూ.20వేలు ఉన్న అరటి నేడు రూ.8వేలకు దిగజారిందని రైతులు అన్నారు. ఎకరాకు 37 టన్నులు రావలసిన అరటి దిగుబడి 15 టన్నులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.