VIDEO: వినూత్న రీతిలో వైన్స్ షాపులో దొంగతనానికి యత్నం
సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని అమృత వైన్స్ షాప్‌లో దొంగలు వినూత్న రీతిలో దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. శనివారం అమృత్ వైన్స్ షాపులో దొంగలు తాళానికి పెట్రోల్ పోసి నిప్పంటించి ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. ఎంతసేపటికి రాకపోవడంతో పెట్రోల్ బాటిల్‌ని కూడా అక్కడే వదిలి పెట్టి పరారయ్యారు.