ఉపఎన్నిక.. రూ.3.3 కోట్లు సీజ్

ఉపఎన్నిక.. రూ.3.3 కోట్లు సీజ్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక కోడ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.3.3 కోట్ల నగదు, 701 లీటర్ల మద్యం, 2 కిలోలకు పైగా గంజాయి, 0.11 గ్రాముల MDMAలను సీజ్ చేశారు. అంతేకాకుండా 24 కేసులు కూడా నమోదయ్యాయి. కాగా నవంబర్ 11న పోలింగ్ జరగగా.. 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు.