జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
ADB: జిల్లాలో నవంబర్ 11 నుంచి 19 వరకు చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు 10°C వరకు పడిపోవచ్చని అంచనా వేసింది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వేడి దుస్తులు ధరించి, వేడి ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు తెలిపారు.