మంత్రి లోకేష్ పర్యటన ఏర్పాట్ల పనుల పరిశీలన
ATP: కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 8న నిర్వహించనున్న శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభా వేదిక స్థలాన్ని టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ శనివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సభ వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.