హజ్ యాత్ర హెల్ప్ లైన్ నెంబర్ ఇదే..!

HYD: నగరం నుంచి అనేక మంది శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారందరి కోసం ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. హజ్ యాత్రకు సంబంధించిన ఏ వివరాలైనా 040-23298793 హెల్ప్ లైన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.