జూరాలకు పెరిగిన వరద ఉదృతి

జూరాలకు పెరిగిన వరద ఉదృతి

MBNR: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,35,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 1,47,596 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 317.990 మీటర్లకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశామని తెలిపారు.