VIDEO: ఐదో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల నిరసన

NTR: నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం తమ సమస్యల పరిష్కరించాలని ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరసన ఐదో రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయు నాయకులు గోపాల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.