చింతచెట్టు పై నుంచి జారి పడి వ్యక్తి మృతి

చింతచెట్టు పై నుంచి జారి పడి వ్యక్తి మృతి

WGL: నెక్కొండ మండలం దీక్షకుంటలో ప్రమాదవశాత్తు చింత చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. చిరబోయిన లక్షణ్ స్వామి చింత చెట్టు ఎక్కి చింత కాయలు దులుపుతుంటే కాలు జారి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో హుటా హుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.