రైతులు దళారుల మాటలు నమ్మవద్దు: వ్యవసాయ అధికారి

రైతులు దళారుల మాటలు నమ్మవద్దు: వ్యవసాయ అధికారి

ప్రకాశం: మార్కాపురం మండలం పెద్ద నాగులవరం గ్రామంలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి బుజ్జి భాయ్ ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. రైతులు సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. కంది కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, దళారుల మాటలు నమ్మవద్దని ఆయన తెలిపారు.