నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NTR: రైల్వే కాలనీ ఫీడర్‌లో మరమ్మతుల నిమిత్తం ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ వై.వి. కొండల రావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో న్యూరాజరాజేశ్వరిపేటలోని జేఎన్ అపార్ట్ మెంట్‌లు, సుబ్బరాజు నగర్, సుందరమ్మ దిబ్బ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.