ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన అదనపు వైద్యాధికారి
ADB: ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్లోని ఆరోగ్య కేంద్రాన్ని అదనపు వైద్య అధికారి మనోహర్ బుధవారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్.సి.డి కార్యక్రమంలో భాగంగా బీపీ, షుగర్ గురించి అవగాహన కల్పించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు.