ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
VKB: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో నిన్న మైనార్టీ యువ నాయకుడు అమీర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, వారికి పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస దీక్షలు క్రమశిక్షణకు, సోదరభావానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.