'ఎక్సైజ్ కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి'
SRPT: ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సోమిరెడ్డి పట్ల కమిషనర్ హరికిరణ్ ప్రవర్తించిన తీరును కోదాడ ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం కోదాడ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సీతారామయ్య మాట్లాడుతూ.. నిజాయితీగల అధికారిపై అసభ్య పదజాలం వాడటం దురదృష్టకరమన్నారు.