నకిలీ ఆర్సీ తయారీ ముఠా గుట్టురట్టు

KRNL: జిల్లాలో నకిలీ ఆర్సీలు తయారు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను సోమవారం కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్, త్రీటౌన్ సీఐ శేషయ్య విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. నంద్యాల, కర్నూలు ప్రాంతాలకు చెందిన నిందితులు, దేశవ్యాప్తంగా నకిలీ ఆర్సీలు, ఎన్ఏసీ, ఐటీఐ సర్టిఫికెట్లను తయారు చేసినట్లు వెల్లడించారు.