ఈనెల 23న ఖమ్మంలో జాబ్ మేళా

KMM: టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న 47 పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, 25-45 సం. వయస్సు కలిగిన మహిళా అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు జాబ్ మేళాకు విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.