కోటగుళ్లలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ దంపతులు

కోటగుళ్లలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ దంపతులు

BHPL: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో గురువారం భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ వేముల శ్రీనివాస్-రజిని దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున వారిని ఘనంగా సత్కరించారు.