నిజాయితీ చాటుకున్న జాంపల్లి గ్రామవాసి
GDWL: ధరూర్ మండలం జాంపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ తన నిజాయితీని చాటుకున్నారు. గద్వాలకు వస్తున్న క్రమంలో ధరూర్ మండల కేంద్రం సమీపంలో గల పెట్రోల్ బంక్ రోడ్డు వద్ద ఆయనకు రూ. 3200 దొరికాయి. మల్లేష్ ఆ డబ్బులను వెంటనే గద్వాల టౌన్ పోలీసులకు అప్పగించారు. డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి తగిన ఆధారంతో సంప్రదిస్తే అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.