సరఫరాకు ముందు పరీక్షలు చేయాలి: ఎండీ

HYD: నగరంలో తాగునీరు సరఫరా అయ్యే సమయంలో కచ్చితంగా మంచినీటి నాణ్యతను పరీక్షించాలని అధికారులను MD అశోక్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్తీలు, లోతట్టు ప్రాంతాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. క్లోరిన్ బిల్లలను ఇంటింటికి పంపిణీ చేయాలని పేర్కొన్నారు.