వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యే
MLG: మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ దేవస్థానంలో గురువారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి , కాంగ్రెస్ నాయకులతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దెల వద్ద మొక్కలు చెల్లించుకున్నారు. వనదేవతల ఆశీస్సులతో పరకాల నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.