మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణి మృతి
TG: కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత మృతి చెందారు. ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వరుస మరణాలతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. మాజీ ఎమ్మెల్యే సాయన్న, ఆయన కుమార్తె లాస్య నందిత మరణించిన విషయం తెలిసిందే.