భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు
KMM: తిరుమలయపాలెం(M) కొక్కిరేణి క్రాస్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్ నుంచి సేకరించిన ఈ బియ్యాన్ని ఖమ్మం వైపు విక్రయానికి తీసుకెళ్తుండగా వాహనాన్ని ఆపి తనిఖీ చేసినట్లు SI. జగదీష్ తెలిపారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న డీలర్ కోసం గాలింపు చేపట్టారు.