ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ భేష్

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ భేష్

MBNR: వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన భారతి గచ్చిబౌలి నుంచి జడ్చర్ల వెళ్లే బస్సులో తన బ్యాగును మర్చిపోయారు. అందులో రూ.15,000 నగదు ఉన్నాయి. జడ్చర్ల బస్టాండ్‌లో విధుల్లో ఉన్న స్టేషన్ మేనేజర్ వి.రవీంద్రనాథ్, ట్రాఫిక్ గైడ్ శివరాములు, సెక్యూరిటీ గార్డు లింగంపేట నర్సింహులు ఆ బ్యాగును గుర్తించి, ప్రయాణికురాలికి అప్పగించారు.